'కాంగ్రెస్ నేతల కృషికి ఫలితమే వికారాబాద్ చార్మినార్ జోన్‌లో కలిసింది' - _Dcc_President_Pc
వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పార్టీ చేసిన కృషికి ప్రతిఫలమని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు.
జోగులాంబ గద్వాల్ జోన్‌లో కలిపిన వికారాబాద్ జిల్లాను తిరిగి చార్మినార్ జోన్ పరిధిలో కలపడంపై ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నాళ్లుగా తాము చేసిన పోరాటం ఫలించిందన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత వికారాబాద్‌ను జోగులాంబ గద్వాల్లో కలపడం వల్ల జిల్లా వాసులు తీవ్రంగా నష్టపోయారని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చార్మినార్‌జోన్‌లో కలపాలని కోరుతూ తాము చేసిన నిరాహార దీక్షలు, బంద్‌లు, మంత్రులను అడ్డుకోవడం లాంటి అనేక కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా చేపట్టడం వల్లనే ప్రభుత్వం దిగొచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా ప్రయత్నిస్తామని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు.
ఇదీ చూడండి: 'ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర'