తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెలాఖరులోగా రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేయాలి : కలెక్టర్​ - vikarabad district news

వికారాబాద్​ జిల్లాలోని పలు గ్రామాల్లో కలెక్టర్​ పౌసుమీ బసు పర్యటించారు. రైతు వేదిక భవన నిర్మాణాలను పరిశీలించి... ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

vikarabad collector inspected farmer platforms in district
ఈ నెలాఖరులోగా రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేయాలి : కలెక్టర్​

By

Published : Oct 13, 2020, 8:11 AM IST

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని కుల్కచర్ల, కుసుమసముద్రం గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనులను కలెక్టర్​ పౌసుమీ బసు పరిశీలించారు. పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుల్కచర్ల గ్రామంలో ఆస్తుల నమోదులో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కుసుమసముద్రంలో వైకుంఠధామం, డంపింగ్​ యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీపీ శ్రీమతి సత్య హరిశ్చంద్ర, రైతు సమన్వయ కమిటీ ఛైర్మన్ పీరంపల్లి రాజు, సుందర్ పాల్గొన్నారు.


ఇవీ చూడండి: ధరణి యాప్​ వల్ల నష్టాలు లేవు... పుకార్లు నమ్మొద్దు: సీఎస్​

ABOUT THE AUTHOR

...view details