తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​,  ఎస్పీ - municipal elections in telangana

పురపాలక ఎన్నికల ప్రక్రియలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్, ఎస్పీ నారాయణ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

vikarabad collector and sp visit municipal election counting centers
ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​,  ఎస్పీ

By

Published : Jan 14, 2020, 11:00 PM IST

వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ అయేషా మస్రత్, ఎస్పీ నారాయణ తాండూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పురపాలక సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్​ తెలిపారు. పోలింగ్​తో పాటు లెక్కింపు కోసం కూడా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

పోలీస్ బందోబస్తు

జిల్లాలోని 4 పురపాలక సంఘాల ఎన్నికలకు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణ తెలిపారు. ఇప్పటికే పాత నేరస్తులను జిల్లావ్యాప్తంగా బైండోవర్ చేసినట్లు చెప్పారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​, ఎస్పీ

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: గద్వాల సంస్థానంలో పుర సమరం

ABOUT THE AUTHOR

...view details