తెలంగాణ

telangana

ETV Bharat / state

'వలస కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి' - vikarabad bjp helps needy

వికారాబాద్​ జిల్లా తాండూరు పరిధిలోని వలస కార్మికులను గుర్తించి వారికి సాయమందించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు మున్సిపల్​ కమిషనర్​ను కోరారు. తాండూరు నాపరాతి పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులకు మాస్కులు, భోజనం అందించారు.

vikarabad bjp helps migrant labor in lock down
తాండూరులో కార్మికులకు సరుకులు

By

Published : May 1, 2020, 2:05 PM IST

వికారాబాద్​ జిల్లా తాండూరు నాపరాతి పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులకు భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు చేయూతనందించారు. నాపరాతి పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులకు మాస్కులు, భోజనం అందించారు.

బతుకుదెరువు కోసం లాక్​డౌన్​తో తాండూరులో చిక్కుకుపోయిన వలస కార్మికులను గుర్తించి ఆదుకోవాలని మున్సిపల్​ కమిషనర్​కు భాజపా నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగారం నర్సింహులు, బాల్ రెడ్డి, మనోహర్ రావు, రమేష్ కుమార్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details