వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాపోలు గ్రామం నుంచి పరిగి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో షఫి(21), సలాఉద్దీన్(21)లు అక్కడిక్కడే మృతి చెందారు. ముజీబ్(22) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కి తరలించారు. మృతులిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో... గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.