తెలంగాణ

telangana

ETV Bharat / state

Tombs in field: ఉదయాన్నే పొలానికి వెళితే రెండు సమాధులు వెలిశాయి! - వికారాబాద్ జిల్లా వార్తలు

ఆరు నెలల క్రితం పొలం కొన్నారు. అప్పటి దాకా బాగానే ఉంది. కానీ రెండు రోజుల క్రితమే పొలాన్ని చదును చేసేందుకు దున్ని పెట్టారు. మరుసటి రోజు ఉదయం వెళ్లేసరికి పొలంలో రెండు సమాధులు ప్రత్యక్షమయ్యాయి. ఈ విచిత్ర సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో జరిగింది.

two tombs at field
పొలంలో రెండు సమాధులు ప్రత్యక్షం

By

Published : Nov 9, 2021, 5:45 PM IST

వికారాబాద్ జిల్లాలో విచిత్రమైన సంఘటన జరిగింది. సినిమా దృశ్యాన్ని తలపించింది. రాత్రికి రాత్రే పొలంలో వెలసిన సమాధులను చూసి గ్రామస్థులు విస్తుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ సమక్షంలో సమాధులను తొలగించగా వాటిలో ఏమి లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భూమిని కొనుగోలు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి పనులు చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చేవెళ్లకు చెందిన యాసీన్, జావేద్ ఆరు నెలల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం భూమిని చదును చేశామని.. నిన్న సాయంత్రం కూడా పొలాన్ని చూసి వెళ్లామని చెబుతున్నారు. ఈరోజు ఉదయం పొలానికి వచ్చేసరికి రెండు సమాధులు ప్రత్యక్షమైనట్లు చెప్పారు. రాత్రికి రాత్రే వెలసిన సమాధులను చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురై గ్రామ సర్పంచ్​కు సమాచారం ఇచ్చారు. భూమి కొనుగోలు చేసిన వారికి కొత్తగా కొనేవారికి భయబ్రాంతులకు గురిచెయ్యడానికి ఇలాటి పనులు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:

Panjagutta Girl murder case: ఐదేళ్ల బాలిక హత్య కేసులో ముమ్మర దర్యాప్తు.. ఆ నలుగురు ఎవరు?

ABOUT THE AUTHOR

...view details