వికారాబాద్ జిల్లా తాండూర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీలు కార్మికుల సమ్మెకు మద్దతునిచ్చాయి. ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల నిరసన ప్రదర్శనకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులను వాడుకొని ఇప్పుడు వారి సమస్యలను పరిష్కరించకుండా సీఎం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కార్మికులతో చర్చలు జరపకుండా తుగ్లక్ పాలన చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు
రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోంది: కాంగ్రెస్ - TSRTC Strike in Vikarabad district
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వికారాబాద్ జిల్లా తాండూరులో విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కార్మికుల విషయంలో పెద్దన్నపాత్ర వహించాల్సిన ముఖ్యమంత్రి అసలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోంది: కాంగ్రెస్
రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోంది: కాంగ్రెస్
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
Last Updated : Oct 17, 2019, 8:33 AM IST