పరిగిలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు - Lock down Latest News
ఎట్టకేలకు రథ చక్రాలు కదిలాయి. రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో దాదాపు 2 నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కాగా అంతర్‌రాష్ట్ర బస్సులకు అనుమతి లేదని అధికారులు తేల్చిచెప్పారు.
![పరిగిలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు TSRTC buses on the road after 57 days of lock down in Telangana State](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7256900-197-7256900-1589864673019.jpg)
పరిగిలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
వికారాబాద్ జిల్లా పరిగి నుంచి బస్సులు కదిలాయి. ఉదయం ఐదు గంటల నుంచే బస్సులు ప్రారంభమయ్యాయి. పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా రద్దీగా ఉండే దూర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు. పరిగి నుంచి మంత్రాలయం, మహబూబ్నగర్, షాద్నగర్, కొడంగల్ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. బస్సులో ప్రయాణించేవారు మాస్క్లు ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని వెల్లడించారు.