వికారాబాద్ జిల్లా పరిగిలో క్రిస్మస్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి నిరుపేదలకు అండగా నిలుస్తోన్నారని పేర్కొన్నారు. అనంతరం క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి... దుస్తుల పంపిణీ చేశారు.
'సీఎం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు' - welfare schemes in telangana
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోన్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. దుస్తుల పంపిణీ చేశారు.
సీఎం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. 6 సంవత్సరాలుగా.. ప్రభుత్వం అన్ని కులాల వారికి దుస్తుల పంపిణీ చేస్తోందని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో క్రిస్మస్ విందు కార్యక్రమాలను రద్దు చేశామని స్పష్టం చేశారు.