ముఖ్యమంత్రి కేసీఆర్ 14సంవత్సరాల ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో తెరాస 20వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
కొడంగల్‌లో తెరాస ఆవిర్భావ వేడుకలు - దౌల్తాబాద్‌లో తెరాస ఆవిర్భావ వేడుకలు
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం అద్భుతంగా జరుగుతోందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దౌల్తాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
![కొడంగల్‌లో తెరాస ఆవిర్భావ వేడుకలు trs anniversary celebrations at kodangal vikarabad distric](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6957542-thumbnail-3x2-vikb.jpg)
కొడంగల్‌లో తెరాస ఆవిర్భావ వేడుకలు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఉషారాణి, ఎంపీపీ, కౌన్సిలర్ మధు యాదవ్, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఉద్యమ ప్రస్థానం: గుండె గుండెలో గులాబీ లిఖితం