కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన పెద్దపల్లి జిల్లా నాగేపల్లికి చెందిన జవాన్ శ్రీనివాస్‌కు వికారాబాద్ జిల్లా పరిగిలో మంగళవారం నివాళులు అర్పించారు. స్వేరోస్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేశాలు.
ఉగ్రదాడిలో మరణించిన జవాన్ శ్రీనివాస్‌కు పరిగిలో నివాళి - పరిగి తాజా వార్తలు
పరిగిలో కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన జవాన్ శ్రీనివాస్‌కు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి..జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వికారాబాద్ జిల్లా స్వేరోస్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కోరారు.
ఉగ్రదాడిలో మరణించిన శ్రీనివాస్‌కు పరిగిలో నివాళి
ఉగ్రవాదుల దాడిలో తెలంగాణ బిడ్డ మరణించడం బాధాకరమని వికారాబాద్ జిల్లా స్వేరోస్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. అమరవీరుడు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:ప్రైవేట్‌లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్