Revanth reddy on TRS: తెలంగాణను సీఎం కేసీఆర్ కబంధ హస్తాల్లో బంధించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెరాస అన్యాయాలను ఎక్కడిక్కడ ఎండగడతామని పేర్కొన్నారు. అభివృద్ధి కోసమంటూ తెరాసలో చేరిన వాళ్లు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మినీ స్టేడియంలో జరిగిన మన ఊరు- మన పోరుసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆధ్వర్వంలో జరిగిన కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
కేసీఆర్, జగన్ కలిసి నిండాముంచారు
సీఎం కేసీఆర్ చేవెళ్లకు ప్రాణహిత ప్రాజెక్టు రాకుండా చేశారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డిని ఆపుతామని ఎన్జీటీలో అఫిడవిట్ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణను నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ సాధించుకుంటే.. ఇప్పుడు నీళ్లు ఏపీకి, నిధులు గుత్తేదారులకు వెళ్తున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నియామకాలు కేసీఆర్ ఇంట్లో మాత్రమే జరిగాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ యాసంగి వడ్లు కొనకపోతే ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదీ చూడండి: