వికారాబాద్ జిల్లాలో ఈరోజు కొత్తగా మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిని అధికారులు హైదరాబాద్లోని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురు గతేడాది ఉపాధికోసం ముంబయి వెళ్లారు. లాక్డౌన్ నేపథ్యంలో వారు మే 15న అక్కడి నుంచి బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి తనిఖీ కేంద్రం వద్ద వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొదటి రెండు పరీక్షల్లో వారికి నెగిటివ్ వచ్చింది.
వికారాబాద్ జిల్లాలో మరో మూడు కరోనా కేసులు - Vikarabad district latest news today
రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఈరోజు మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
![వికారాబాద్ జిల్లాలో మరో మూడు కరోనా కేసులు Three more corona cases in Vikarabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7423933-950-7423933-1590942349539.jpg)
వికారాబాద్ జిల్లాలో మరో మూడు కరోనా కేసులు
మరోసారి అధికారులు పరీక్షలు చేశారు. కానీ ఆ నివేదిక వచ్చే లోపే వారు స్వగ్రామానికి చేరుకున్నారు. నివేదిక చూసిన అధికారులు వారి కోసం వాకబు చేశారు. ఆ నివేదికను ఇక్కడి అధికారులకు చేరవేశారు. స్పందించిన అధికారులు వెంటనే వారిని హైదరాబాద్కు తరలించారు. వారితో కలిసి ఉన్న 10 మందిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్ కేసులు... ఐదుగురు మృతి