వికారాబాద్ జిల్లా పరిగిలో మూడో రోజు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంతర్ రాష్ట్ర బీజాపూర్ రహాదారిపై ధర్నా చేశారు. ప్రభుత్వం తమను ఎంత భయపెట్టినా భయపడమని, మా డిమాండ్లను తీర్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఆ కార్మికులు పోలీస్స్టేషన్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికులను స్టేషన్కు తరలించిన పోలీసులు - వికారాబాద్ జిల్లా పరిగిలో మూడో రోజు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు
వికారాబాద్ జిల్లా పరిగిలో మూడో రోజు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించగా అక్కడ కార్మికులు పోలీస్ స్టేషన్ముందు కూర్చుని నిరసన తెలిపారు.
ఆర్టీసీ కార్మికులను స్టేషన్కు తరలించిన పోలీసులు