కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ ఎత్తున రైతు భరోసా దీక్ష చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ తెరాస ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు భరోసా దీక్ష - Vikarabad District latest News
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని... వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా దీక్షను చేపట్టింది. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ తెరాస ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రైతులకు రుణ మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
![సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు భరోసా దీక్ష The Congress party has taken up the farmer assurance initiative at the Kulkacharla Mandal Center in Vikarabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10596898-610-10596898-1613128457072.jpg)
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు భరోసా దీక్ష
పూర్తిస్థాయిలో రైతులకు రుణ మాఫీ చేయాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరిగి కుల్కచర్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, ఆంజనేయులు, తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కుమ్మక్కు రాజకీయాలతో పదవులు దక్కించుకున్నారు: కిషన్ రెడ్డి