వికారాబాద్ జిల్లా తాండూర్లోని ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ శనివారం తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పెంపొందించాలని సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులు దోమల భారిన పడకుండా ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆసుపత్రి భద్రతా సిబ్బంది కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వేతనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా పాలనాధికారి సిబ్బందికి భరోసా ఇచ్చారు.
ఆసుపత్రిలో పారిశుద్ధ్యం ఉండాలని కలెక్టర్ ఆదేశం - She instructed the superintendent to improve sanitation in the hospital
వికారాబాద్ జిల్లా తాండూర్లోని ఆస్పత్రిలో కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ శనివారం తనిఖీలు చేశారు. ఆస్పత్రిలో వివిధ వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో పారిశుద్ధ్యం ఉండాలని కలెక్టర్ ఆదేశం