వికారాబాద్ జిల్లా పరిగిలో కరెంటు తీగలపై పడిన గాలి పటాన్ని తీయబోయి ఓ బాలుడు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడం వల్ల పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరిగి బస్ డిపోలో పని చేస్తున్న జాయేద్ అలీ బహార్పేట్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతని కుమారుడితో పాటు మరో పండ్ల వ్యాపారి రఫి కుమారుడు ఇంటి పైన గాలి పటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం విద్యుత్ వైర్లలో చిక్కుకుంది. అక్కడ ఉన్న ఇనుప రాడ్డుతో గాలిపటాన్ని తీసేందుకు ఇద్దరూ ప్రయత్నించారు.