స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేసిన కృషి వల్ల కొడంగల్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని స్పష్టం చేశారు. కొడంగల్‌లో తెరాస తరఫున పట్నం నరేందర్ రెడ్డి గెలిచి ఏడు నెలలు గడుస్తున్నా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థులకే అవకాశం ఇవ్వండి : రేవంత్ రెడ్డి - FORMER KODANGAL MLA
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రజలను కోరారు.

నా వల్లే కొడంగల్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు : రేవంత్
గతంలో జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలుపొంది దిల్లీకి వెళ్లినా... కొడంగల్‌ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని రేవంత్ స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉన్నా కొడంగల్ ప్రజలు తన గుండెల్లోనే ఉంటారని పేర్కొన్నారు.
దిల్లీకి వెళ్లినా... కొడంగల్‌ను మాత్రం వదలను : రేవంత్ రెడ్డి