తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు వికారాబాద్​లో తెరాస భారీ బహిరంగ సభ - vikarabad

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా ఇవాళ వికారాబాద్‌లో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కేసీఆర్ ఈ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సీఎం పాల్గొనే చివరి సభ కావడం వల్ల వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నుంచి దాదాపు 1.75 లక్షల మంది వస్తారని అంచనా..

నేడు వికారాబాద్​లో తెరాస భారీ బహిరంగ సభ

By

Published : Apr 8, 2019, 5:13 AM IST

Updated : Apr 8, 2019, 7:23 AM IST


లోక్​సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గాన్ని తెరాస అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఇందుకోసమే ఈ నియోజకవర్గ సభను వికారాబాద్​లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈరోజు జరిగే సభకు సీఎం కేసీఆర్​ హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

సీఎం పాల్గొనే చివరి సభ అయ్యే అవకాశం
చేవెళ్ల నియోజక వర్గానికి ప్రాధాన్యం ఉన్నందున ఇక్కడ తప్పనిసరిగా గెలవాలని తెరాస పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికల్లో వికారాబాద్​ సభ సీఎం పాల్గొనే చివరి సభ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కేటీఆర్ పర్యవేక్షణ పనులు ​స్వయంగా చూస్తున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గ నేతలతో విస్తృతస్థాయి సమావేశాలు జరిపారు.

పార్టీ నేతలకు సమన్యయ బాధ్యతలు
ప్రతి నియోజకవర్గం నుంచి 25వేల మంది చొప్పున మొత్తం 7 నియోజకవర్గాల నుంచి 1.75లక్షల మందిని సమీకరించాలని తెరాస ఎమ్మెల్యేలకు కేటీఆర్​ నిర్దేశించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు సమన్యయ బాధ్యతలు అప్పగించారు.

నేడు వికారాబాద్​లో తెరాస భారీ బహిరంగ సభ

ఇవీ చదవండి: తెలంగాణతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందాలి

Last Updated : Apr 8, 2019, 7:23 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details