Russia Ukraine War: ‘అనుకోని ఘటనలు జరిగే సమయంలో అప్రమత్తం చేసేందుకు మా యూనివర్సిటీ అధికారులు సైరన్ ఏర్పాటు చేశారు. అది మోగగానే వర్సిటీ ప్రాంగణంలోనే ఉన్న బంకర్లలోకి వెళ్లండి.. సురక్షితంగా ఉండే అవకాశముందని చెప్పారు. ప్రభుత్వం విమాన సేవలు కల్పిస్తే భారత్‌కు వచ్చేస్తాం. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు వందల మంది ఉక్రెయిన్‌లో ఉన్నారు’ .. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన వర్కల ఆశిష్‌కుమార్ (20) చెబుతున్న మాటలివి.
'సైరన్ మోగితే బంకర్లలోకి వెళ్లమన్నారు'.. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థి - Russia Ukraine war crisis
Russia Ukraine War: రష్యాతో యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న రాష్ట్ర విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు... స్వస్థలాలకు రావడానికి విమానాల్లేక దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. ప్రభుత్వం విమాన సేవలు కల్పిస్తే భారత్‌కు వచ్చేస్తామని వారు వాపోతున్నారు.
ఆ దేశంలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఆశిష్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం తప్పదన్న సంకేతాలతో ముందు జాగ్రత్తగా బుధవారం వారం రోజులకు సరిపడా కూరగాయలు, కిరాణా సామగ్రిని కొనుగోలు చేసినట్లు అతడు వివరించారు. గురువారం రష్యా దాడుల వార్తలతో కలత చెందిన తాము ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆశిష్‌తో ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. బాంబు పేలుళ్ల చప్పుళ్లతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొందని తమ కుమారుడు అంటున్నాడని, ప్రభుత్వం అక్కడి విద్యార్థులందరినీ క్షేమంగా స్వదేశం తరలించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: