trs leaders internal fighting: వికారాబాద్ జిల్లా తాండూరులో తెరాస నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగారు. ఇరువురిని మంత్రి సబిత సముదాయించారు.
డీఎంఎఫ్టీ నిధుల కింద మంజూరైన దోమల నియంత్రణ యంత్రాలను గ్రామపంచాయతీలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తాండూరులో నిర్వహించారు. అధికారులు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్సీ వర్గీయులు నిరసనకు దిగారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. కొంతసేపు గందరగోళ పరిస్థితి తలెత్తింది. వేదికపై ఉన్న మంత్రి సబిత ఇరువర్గాలను సముదాయించారు. ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని మంత్రి సబిత... అధికారులను ఆదేశించగా.. పరిస్థితి సద్దుమణిగింది.
తాండూరులో తెరాస నేతల మధ్య వర్గపోరు... మంత్రి ఎదుటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాగ్వాదం ఇదీ వివాదం..
వికారాబాద్ జిల్లా తాండూరులో గ్రామపంచాయతీలకు దోమల నివారణ యంత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. తమ పరిధిలో నిర్వహిస్తూ తమను ఎందుకు పిలవలేదని ఛైర్‌పర్సన్, పాలకవర్గ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక వద్దే ఎమ్మెల్సీ వర్గీయుల నిరసనకు దిగారు. అయితే ఇది గ్రామపంచాయతీలకు సంబంధించిన కార్యక్రమేనని అధికారులు పేర్కొన్నారు. వికారాబాద్ అదనపు కలెక్టర్ పట్ల ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి దురుసు ప్రవర్తించారు. అధికారులకు మద్దతుగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిలిచారు. పంచాయతీల కార్యక్రమంలో వివాదం ఎందుకని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జోక్యంతో... ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మధ్య వాగ్వాదం మొదలైంది. మంత్రి సబిత సమక్షంలోనే రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. వేదికపై ఉన్న మంత్రి సబితా రెడ్డి జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు.
ఇదీ చూడండి:Road Accident CCTV Footage: స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్.. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి