వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో 30 పడకల నూతన ప్రభుత్వాసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే మహేశ్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పరిగిలో ప్రభుత్వాసుపత్రి ఏర్పాటు చేశామని తెలిపారు.
పరిగి పురపాలికలో 30 పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభం - Telangana health minister etala rajender
ఆరోగ్యం విషయంలో తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు, కేరళ సరసన ఉందని రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ ఐతే.. కేసీఆర్ కిట్‌తో పాటు నగదు ఇస్తున్న ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పురపాలికలో 30 పడకల నూతన ఆసుపత్రిని ప్రారంభించారు.
![పరిగి పురపాలికలో 30 పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభం Telangana health minister etala rajender inaugurated](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9562299-221-9562299-1605534944493.jpg)
పరిగి పురపాలికలో 30 పడకల ప్రభుత్వాసుపత్రి ప్రారంభం
ఆరోగ్యం విషయంలో తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు, కేరళ సరసన ఉందని మంత్రి ఈటల అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ ఐతే.. కేసీఆర్ కిట్‌తో పాటు నగదు ఇస్తున్న ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్, జడ్పీటీసీ హరిప్రియా రెడ్డి, ఎంపీపీ అరవింద్ రావు, తెరాస నాయకులు పాల్గొన్నారు.