ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని, వాటన్నింటిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వికారాబాద్‌లో జరిగిన తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కునమోదు చేసుకునే బాధ్యత కార్యకర్తలపైనే ఉందని తెలిపారు.
ప్రతి కార్యకర్త.. ఓ అభ్యర్థిలా కష్టపడాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి తెరాస గెలుపు కోసం కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెరాస సర్కార్‌పై ప్రజలకు ఎంతో నమ్మకముందన్న మంత్రి.. అందుకే రెండోసారి కూడా కేసీఆర్‌కే పట్టం కట్టారన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తెరాస అభ్యర్థినే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేసినా.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తెరాస సర్కార్ పని చేసిందని కొనియాడారు. కార్యకర్తలంతా కలిసి తెరాస అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.