వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలక సంఘంలో మల్లికార్జున సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పురపాలక సంఘానికి చెందిన దుకాణం కేటాయిస్తానని... రూ.60వేలు లంచం తీసుకున్నాడు అంటూ... పట్టణానికి చెందిన చారి ఆరోపించాడు.
'ఆ అధికారి లంచం తీసుకున్నాడు... అడిగితే దాడి చేస్తున్నాడు' - tandur municipal senior assistant taking bribe news
దుకాణం కేటాయిస్తానని లంచం తీసుకుని... షట్టర్ కేటాయించ లేదంటూ ఓ వ్యక్తి మున్సిపల్ అధికారిని నిలదీశాడు. రెచ్చిపోయిన అధికారి సదరు వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుర్భాషలాడుతూ... వీరంగం సృష్టించిన ఘటన తాండూరు పురపాలక సంఘంలో చోటు చేసుకుంది.
'ఆ అధికారి లంచం తీసుకున్నాడు... అడిగితే దాడి చేస్తున్నాడు'
రోజులు గడుస్తున్న దుకాణం కేటాయించ లేదంటూ... కార్యాలయానికి వచ్చి అధికారిని నిలదీశాడు. ఇదే క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన మల్లికార్జున్... సదరు వ్యక్తిపై దాడి చేశాడు. అతని తండ్రిపై చేయి చేసుకున్నాడు. దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించాడు. మల్లికార్జునపై చర్యలు తీసుకోవాలంటూ చారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి:వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం