వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండల కేంద్రానికి చెందిన సమీనా కుమారుడు 6నెలల క్రితం అనోరోగ్యానికి గురయ్యాడు. కొడుకు ఆపరేషన్ డబ్బు కోసం తెలిసిన వారి సహకారంతో దుబాయ్‌లో ఓ ఇంట్లో పనికి చేరింది. ఆమె యజమానులు నెలలు గడిచినా జీతం ఇవ్వకపోగా, శారీరకంగా హింసిస్తున్నారని విలపించింది. తనను కాపాడమని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : స్వదేశానికి చేరిన సమీనా
ఈటీవీ భారత్ చొరవతో దుబాయ్‌లో ఆమె కష్టాలు తీరాయి. పరదేశంలో నరకయాతన అనుభవించిన సమీనా ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నది.
వెంటనే స్పందించిన ఈటీవీ భారత్ సోషల్ మీడియాలో పంపిన ఈ వీడియోని ప్రసారం చేసింది. గమనించిన వికారాబాద్ జిల్లా భాజపా అధ్యక్షులు కర్ణం ప్రహ్లాద్‌రావు, స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డిలు... సమీనాను ఇక్కడకు తీసుకొచ్చేందుకు చొరవ చూపారు. తన కష్టాలను అందరికి తెలిసేలా చేసిన ఈటీవీకి రుణపడి ఉంటానని సమీనా తెలిపింది. స్వస్థలానికి వచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. పని కోసం ఎవరు కూడా దుబాయ్ వెళ్లి తన కష్టాల పాలు వద్దని సూచించింది. ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలని సూచించింది.
ఇదీ చూడండి : అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల కొరడా