వికారాబాద్ జిల్లా దోమ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఐనాపూర్ గ్రామానికి చెందిన ఆరీఫ్ పాషాకు చెందిన 3ఎకరాల భూమిని సర్వే చేయడానికి దోమ సర్వేయర్ భాగ్యవతిని ఆర్జీ పెట్టుకోగా... లాక్డౌన్ నుంచి తిప్పుతున్నారని బాధితుడు ఆరోపించారు. చాలాసార్లు కార్యాలయం చుట్టూ తిరగగా డిసెంబర్ నెలలో నామమాత్రంగా సర్వే చేసి రూ.10వేలు డిమాండ్ చేశారని ఆరోపించారు.
దోమ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి - తెలంగాణ వార్తలు
వికారాబాద్ జిల్లాలోని దోమ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.3వేలు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సర్వేయర్ డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు వెల్లడించారు.
రూ.10వేలు ఇవ్వలేక రూ.2 వేలు ఇచ్చినట్లు వెల్లడించారు. మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించానని తెలిపారు. మిగిలిన డబ్బులు గూగుల్ పే చెయ్యమన్నారని వెల్లడించారు. గూగుల్ పే లేదంటే తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నా కంప్యూటర్ ఆపరేటర్‌కు డబ్బులు ఇవ్వమని చెప్పినట్లు వివరించారు. కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్‌కు రూ.3వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో గంగాధర్, రామలింగారెడ్డి, రాజశ్, ఎస్సై మదిలేటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఫేక్ న్యూస్‌తో దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం'