గతేడాది జరిగిన పుల్వామా దాడిలో అసువులు బాసిన సైనికులకు మద్దతుగా వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాతో ప్రాథమిక పాఠశాల నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు.
అమర జవాన్లకు నివాళులు అర్పించిన విద్యార్థులు - vikarabad district today news
పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు పలు పాఠశాలల విద్యార్థులు నివాళులు అర్పించారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో విద్యార్థులు, గ్రామస్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
అమర జవాన్లకు నివాళి అర్పించిన విద్యార్థులు
ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్లను స్మరిస్తూ... వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.