వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మూడో రోజు వైభవంగా సాగాయి. అర్చకులు.. స్వామి వారికి మంగళ హారతులతో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని పేదల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.
ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
అనంతరం అర్చకులు.. ఉత్సవమూర్తులను సింహవాహనంపై ఎక్కించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. గోవిందనామ స్మరణతో వీధులన్నీ మారుమోగాయి.