వికారాబాద్ జిల్లాలో లాక్ డౌన్ (lockdown)ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. జిల్లాలోని తాండూరు పట్టణంలో లాక్ డౌన్ అమలు తీరును ఆయన పరిశీలించారు. రోడ్డుపై వచ్చిపోయే వాహనదారులను ఆపి తనిఖీ నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ (vehicles seize) చేశారు.
Lockdown:లాక్ డౌన్ పకడ్బందీగా అమలు: ఎస్పీ నారాయణ - వికారాబాద్ జిల్లా లో లాక్ డౌన్
జిల్లాలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నామని ఎస్పీ నారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో 9 వేల 869 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
![Lockdown:లాక్ డౌన్ పకడ్బందీగా అమలు: ఎస్పీ నారాయణ Lockdown in Vikarabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:31:25:1622286085-11943440-tdr.jpg)
జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 9 వేల 869 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వాటిలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 367 కేసులు నమోదు చేయగా.. మొత్తం 4 వేల 112 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రూ.84 లక్షల 93వేల జరిమానా విధించినట్లు ఎస్పీ వివరించారు. సీజ్ చేసిన వాహనాలను యజమానులు కోర్టు లేదా మీ సేవా ద్వారా చలానాలు కట్టి తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ ను అరికట్టడానికి, ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.