black fungus: తండ్రికి లక్షణాలున్నాయని వదిలివెళ్లిన కుమారుడు - black fungus cases in parigi
12:39 May 27
తండ్రికి లక్షణాలున్నాయని వదిలివెళ్లిన కుమారుడు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రుక్కుంపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్‌ఫంగస్ లక్షణాలుండడం వల్ల... తననే వైద్యం చేయించుకోమని తండ్రిని వదిలేసి వెళ్లిపోయాడో పుత్రరత్నం. చంద్రయ్యకు (63) ఈ నెల మూడున కరోనా బారిన పడ్డాడు. తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత చంద్రయ్యలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి.
కన్ను, నుదుటి భాగంలో వాపుతో పాటు ఇన్ఫెక్షన్ కాగా... తన వల్ల కాదంటూ చంద్రయ్య కొడుకు అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. వైద్యం కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్న చంద్రయ్యను... గ్రామానికి చెందిన ఆశావర్కర్ గుర్తించింది. డాక్టర్‌కు వద్దకు తీసుకెళ్లి చూపించింది. చంద్రయ్యకు ఉన్న లక్షణాలు బ్లాక్‌ఫంగస్‌కు సంబంధించినవేనా..? కాదా..? అనే విషయంపై వికారాబాద్ మహవీర్ ఆసుపత్రికి పంపించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు.