వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నెలో గ్రామ సహకార సంఘం డైరెక్టర్ వెంకట్రాం రెడ్డి పొలంలో వెండి నాణేలు దర్శనమిచ్చాయి. మూడు రోజుల కిందట తన పొలాన్ని చదును చేయిస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. ఆయనతో పాటు ఆ సమయంలో అక్కడ ఉన్న మరికొందరు వాటిని తీసుకెళ్లారు. విషయం బయటికి పొక్కడం వల్ల పోలీసు, రెవెన్యూ అధికారులు బుధవారం పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం 141 వెండి నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పొలం దున్నితే... వెండి నాణేలు ప్రత్యక్షం - SILVER COINS FOUND IN A FARMERS FIELD
ఓ రైతు తన పొలం చదును చేయిస్తుండగా... వెండి నాణేలు బయపడ్డాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పీఏసీఎస్ డైరెక్టర్ పొలంలో లభించిన నాణేలను స్థానికులు తీసుకున్నారు.
141 నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు