వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని శ్రీరామలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. దేవస్థానంలోని ఏకశిలా పర్వతంపై ఉన్న శివలింగానికి భక్తులు అభిషేకం నిర్వహించారు.
ఏకశిలా పర్వతంపై శివరాత్రి ఉత్సవం - వికారాబాద్ రామలింగేశ్వరాలయంలో శివరాత్రి
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం శివనామస్మరణలతో మార్మోగింది.

ఏకశిలా పర్వతంపై శివరాత్రి ఉత్సవం
రావణ సంహారం అనంతరం కోటి లింగాల ప్రతిష్ఠాపనలో భాగంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.
ఏకశిలా పర్వతంపై శివరాత్రి ఉత్సవం
- ఇదీ చూడండి :పాదరక్షలతో శివాలయంలోకి వెళ్లిన ఉప్పల్ ఎమ్మార్వో