పరిగిలో ఘనంగా శివాజీ జయంతి శోభాయాత్ర
పరిగి పట్టణంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కులకచర్ల మండల కేంద్రం నుంచి పరిగి వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పరిగిలో కొడంగల్ చౌరస్తా నుంచి పరిగి పట్టణ వీధుల్లో శోభాయాత్ర వైభవంగా జరిగింది.
పరిగిలో ఘనంగా శివాజీ జయంతి శోభాయాత్ర
వికారాబాద్ జిల్లా పరిగిలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. హిందూ వాహిని కార్యకర్తల ఆధ్వర్యంలో పట్టణంలోని కొడంగల్ చౌరస్తా నుంచి పరిగి పట్టణ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో జాట్ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, వివిధ కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.