వికారాబాద్ జిల్లా పాలనాధికారి ఎదుట కొడంగల్ నియోజకవర్గ సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. కొడంగల్లో హరితహారం కార్యక్రమానికి హాజరైన పాలనాధికారి ముందు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయాలని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల సర్పంచ్లు బైఠాయించారు. స్పందించిన పాలనాధికారిణి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ సర్పంచులు ఆందోళన విరమించకుండా సమావేశాన్ని బహిష్కరించారు. కొడంగల్ అంబేడ్కర్ చౌరస్తాలో కూర్చొని రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న సీఐ నాగేశ్వరావు, సిబ్బందితో వచ్చి నిరసనను విరమింపజేశారు.
కలెక్టర్ ముందే హరితహారాన్ని బహిష్కరించిన సర్పంచులు - ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు
ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలని కొడంగల్ నియోజకవర్గ సర్పంచులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలి : సర్పంచ్లు