గ్రామ కార్యదర్శిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన సర్పంచ్‌పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి గ్రామ సర్పంచ్ అసదుద్దీన్ హైదర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పౌసమి బసు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 23న సర్పంచ్ దాడి చేసి కులం పేరుతో దూషించాడని గ్రామ కార్యదర్శి బందయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో అప్పట్లోనే సర్పంచ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచ్‌పై పోలీసులు విచారణ జరిపారు. చేసిన దాడికి సంజాయిషీ ఇవ్వాలని అతనికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజ్ నోటీసుకు సర్పంచ్ సరైన సమాధానం ఇవ్వకపోవడం వల్ల అతన్ని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామ కార్యదర్శిపై దాడి చేసిన సర్పంచ్ సస్పెండ్ - vikarabad district
గ్రామ కార్యదర్శిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన సర్పంచ్‌పై వికారాబాద్ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పంపిన షోకాజ్ నోటీసుకు సంజాయిషీ ఇవ్వనందున ఆరునెలల పాటు సర్పంచ్‌ను సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామ కార్యదర్శిపై దాడి చేసిన సర్పంచ్ సస్పెండ్
ఇవీ చూడండి: మానవత్వం చాటుకున్న ఇద్దరు దివ్యాంగులు