వికారాబాద్ జిల్లా కేంద్రంలో సఖి కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని ఎంపీ అన్నారు. మహిళలకు అవగాహన పెరిగిందని.. గృహహింస వంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అయినా సఖి కేంద్రాలు విజయవంతం కావాలని తాను కోరుకోవడం లేదని ఎంపీ స్పష్టం చేశారు. మహిళలకు ఎటువంటి సమస్యలున్నా సఖి కేంద్రాల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని జడ్పీ ఛైర్పర్సన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అయేషా, ఎస్పీ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో సఖి కేంద్రం ప్రారంభం - mp ranjith reddy on sakhi centers
వికారాబాద్‌లో సఖి కేంద్రాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్ అయేషా, ఎస్పీ నారాయణ, ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు.
![వికారాబాద్‌లో సఖి కేంద్రం ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4902248-288-4902248-1572359163718.jpg)
వికారాబాద్‌లో సఖీ కేంద్రం ప్రారంభం