వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో అఖిలపక్ష నాయకులు సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేశారు. బిల్లు ప్రవేశపెట్టినప్పటినుంచి దేశంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా కొడంగల్లో నిరసన ర్యాలీ - ryali against caa and nrc bill
మత విద్వేషాలను రెచ్చగొట్టే సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్లో అఖిలపక్ష నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు.
సీఏఏకు వ్యతిరేకంగా కొడంగల్లో నిరసన ర్యాలీ
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్