తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుడి మృతదేహంతో పరిగి డిపో ముందు ఆందోళన - HIGH TENSION ENVIRONMENT INFRONT OF PARIGI DEPOT

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ తీరుకు మనస్థాపానికి గురైన ఓ కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. పెద్దదిక్కును కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరారు.

మా కుటుంబానికి న్యాయం చేయండి : మృతుడి తల్లి

By

Published : Nov 22, 2019, 2:09 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక తీరుకు... వీరభద్రయ్య గత రెండు రోజులుగా మనోవేదనతో గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వీరభద్రయ్య మృత దేహంతో ఆర్టీసీ కార్మికులు పరిగి డిపోలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా... కార్మికులు డిపోలోనే బైఠాయించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీర భద్రయ్య మృతితో తాము రోడ్డున పడ్డామని... ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుడి తల్లి కోరారు.

మా కుటుంబానికి న్యాయం చేయండి : మృతుడి తల్లి

ఇవీ చూడండి : హైకోర్టు తీర్పు తర్వాతే... ఆర్టీసీపై తుది నిర్ణయం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details