తెలంగాణ

telangana

ETV Bharat / state

మీకు హెచ్​డీఎఫ్​సీలో ఖాతా ఉందా?.. మరి మీరూ కోటీశ్వరులై ఉండొచ్చు.! - money transfer to hdfc card holders in hyderabad

HDFC accounts: 'హాయ్ డియర్.. యువర్ అకౌంట్ కెన్ బి క్రెడిటెడ్ విత్ rs. 2 క్రోర్స్.. టు గెట్ యాన్ అమౌంట్.. ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ లింక్...' అని తరచూ మన చరవాణులకు గానీ మెయిల్స్​కు ​కానీ సందేశాలు వస్తూనే ఉంటాయి. అలా ఆ మెసేజ్​లు చదివిన ప్రతిసారీ.. 'ఓసారి ఏకంగా ఖాతాలోనే డబ్బులు పడ్డాక.. 'క్రెడిటెడ్' అని సందేశం వస్తే బాగుంటుంది కదా'.. అని అనుకోని సామాన్యుడు ఉండడేమో. కానీ ఈ సారి అదే జరిగింది. దాదాపు 100 మందికి పైగా ఖాతాల్లో రూ. కోట్లలో నగదు జమ అయింది. కానీ అందులోంచి వారు రూపాయి కూడా వాడుకునే పరిస్థితి లేదు. కనీసం ఇతర లావాదేవీలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. లక్ష్మీదేవి డోర్ కొడుతున్నా.. తలుపు తీసి లోపలికి ఆహ్వానించలేని పరిస్థితి వాళ్లది.

money transfer to hdfc card holders
హెచ్​డీఎఫ్​సీ ఖాతాల్లో కోట్లలో డబ్బు

By

Published : May 30, 2022, 4:00 PM IST

Updated : May 30, 2022, 4:44 PM IST

HDFC accounts: తెలంగాణతో పాటు మన పక్క రాష్ట్రంలోనూ ఇద్దరు బ్యాంకు ఖాతాదారులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. అది కూడా ఒక బ్యాంకుకు సంబంధించిన ఖాతాల్లోకే. రూ. కోట్లలో వారి ఖాతాల్లోకి నగదు జమ అయినట్లు చరవాణులకు సందేశాలు వచ్చాయి. మొదటగా తమ కళ్లను తాము నమ్మలేక ఓ సారి సందేశాన్ని మళ్లీ చెక్ చేసుకున్నారు. నిజమే తమ ఖాతాల్లోకి కోట్ల కొద్దీ నగదు జమ అయింది. అంతే ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం వారి వంతైంది. కానీ ఆ తర్వాత కాసేపటికే.. ఇదెలా సాధ్యం అనుకుంటూ ఆ తెల్లారి బ్యాంకుకు క్యూ కట్టారు.

వికారాబాద్​కు చెందిన మొబైల్ షాపు నిర్వాహకుడు.. వెంకట్ రెడ్డికి సంబంధించి హెచ్​డీఎఫ్​సీ ఖాతాలో ఒక్కసారిగా ఆదివారం ఉదయం.. రూ. 18 కోట్ల 52 లక్షలు జమ అయ్యాయి. ఆ కాసేపటికే తన ఖాతా కూడా స్తంభించిపోయింది. తన ఖాతాలో అంత మొత్తంలో నగదు జమ అయ్యేసరికి ఆశ్చర్యానికి గురైన వెంకట్ రెడ్డి.. బ్యాంకు అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించారు. అవి తన డబ్బులు కావని తెలిపారు. దీని ద్వారా ఇతర లావాదేవీలు కూడా చేసుకోలేకపోయానని పేర్కొన్నారు.

మొబైల్ నిర్వాహకుడి ఖాతాలో రూ. 18 కోట్లు

'నా మొబైల్ షాపు పేరు మీద హెచ్​డీఎఫ్​సీ కరెంట్ ఖాతా ఉంది. ఆదివారం రోజు నా ఖాతాలోకి ఒక్కసారిగా రూ. 18 కోట్ల 52 లక్షలు జమయ్యాయి. ఈ విషయంపై నేను బ్యాంకు అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించాను. నా ఖాతా కూడా స్తంభించిపోయింది. ఇతర లావాదేవీలు కూడా చేసుకోలేకపోయాను. కస్టమర్ కేర్​ను సంప్రదించాలని సూచించారు. వారికి కాల్ చేస్తే వారి వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు.' -వెంకట్ రెడ్డి, మొబైల్ షాపు నిర్వాహకుడు

మరో చోట పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఓ మొబైల్ షాపు నిర్వాహకుడు ఇల్లెందుల సాయి ఖాతాలో రూ. 5 కోట్ల 68 లక్షలు జమ అయ్యాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు నగదు బదిలీ కాగా.. సుమారు 5 గంటల వరకూ ఖాతాలోనే ఉన్నాయి. ఆ తర్వాత.. మళ్లీ ఆ నగదు అంతా మాయమైంది. ఈ ఉదయం.. బ్యాంకు అధికారులను సాయి సంప్రదించగా.. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

మరో మొబైల్ నిర్వాహకుడి ఖాతాలో రూ. 5 కోట్లు

తమిళనాడు చెన్నైలోని టి.నగర్​ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారులు ఇలాగే ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. తమ మొబైల్​ ఫోన్​లకు వచ్చిన మెసేజ్​లు చూసి అవాక్కయ్యారు. తమ ఖాతాలో రూ.13 కోట్లు జమ అయి ఉండటం చూసి షాక్​ అయ్యారు. వారిలో కొంతమంది ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. ఈ 100 మందికి పైగా ఖాతాదారులకు పొరపాటున నగదు బదిలీ జరిగినట్లు సమాచారం. ఈ ఖాతాలను వెంటనే స్తంభింపజేసిన బ్యాంకు అధికారులు.. సాంకేతిక లోపం వల్ల బదిలీ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బ్యాంకు ఖాతాదారులు ఫెడరల్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్ విభాగానికి ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఇంటర్నెట్ సర్వీస్‌ను హ్యాక్ చేసి ఎవరైనా నగదు బదిలీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ తరపున ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సెంట్రల్ క్రిమినల్ విభాగానికి కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

ఇవీ చదవండి:ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. మొత్తం 100 మందికి.. ఎలా జరిగింది?

సివిల్స్ 2021 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు తేజాలు

Last Updated : May 30, 2022, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details