వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడంగల్ వైపు వెళ్తున్న లారీ, ఆటోను వెనకనుంచి ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి కాళ్లు విరగ్గా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను తమ వాహనాల్లో పరిగి ప్రభుతాసుపత్రికి తరలించారు.
కూలీలతో వస్తున్న ఆటోను ఢీకొన్న లారీ...ఐదుగురికి గాయాలు - road accident in parigi
కూలీ పనుల కోసం వెళ్లి తిరిగొస్తున్న ఆటోను వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రం వద్ద ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి కాళ్లు విరగ్గ.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కూలీలు వస్తున్న ఆటోను ఢీకొన్న లారీ...ఐదుగురికి గాయాలు
రోడ్డు ప్రమాదానికి గురైన వారంతా పరిగి మండలం రూఫ్ఖాన్పేట గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం వెళ్లి.. తిరిగి గ్రామానికి చేరుకుంటుండగా ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొన్న లారీ డ్రైవర్.. వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'
TAGGED:
road accident in parigi