వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలోని గ్రామీణ ప్రాంతమైన గోధుమగూడ సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద అనుమతులు లేకుండానే కొంతమంది ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రవీందర్ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు
గోధుమగూడ సమీపంలోని సర్వే నంబర్ 97లో 18.20 ఎకరాల సర్కారు స్థలంలో కొందరు వ్యవసాయ పనులు చేపడుతున్నారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలో ఉన్న ఎకరం పొలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్థులు సమాచారం ఇచ్చారని తహసీల్దార్ అన్నారు. సర్వే నంబర్ 97లో సుమారు 10 ఎకరాల్లో అక్రమంగా నిర్మిస్తున్న రిసార్ట్‌ను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.