వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉద్ధృతం చేశారు. సమ్మెకు రెవెన్యూ సిబ్బంది మద్దతు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ముందు బైటాయించారు. సమ్మెకు మద్దతుగా సీపీఎం నిరాహారదీక్షలు చేపట్టారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.... స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
ఆర్టీసీ సమ్మె ఉద్ధృతం... పోలీసులు, ఆందోళనకారుల వాగ్వాదం - పరిగిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతం...
ఆర్టీసీ కార్మికుల సమ్మె 13 రోజున కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా పరిగిలోని పలుచోట్ల ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిరసనలు వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా... తోపులాట జరిగింది.
REVENUE EMPLOYEES SUPPORTS TO TSRTC STRIKE IN PARIGI
TAGGED:
TSRTC STRIKE 13TH DAY