వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 9న ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి 22 ఏళ్ల నగేష్ దుశ్చర్యకు ఒడిగట్టాడు. మరుసటి రోజు చిన్నారికి జ్వరం రావడం వల్ల తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారి ద్వారా అత్యాచారం గురించి తెలిసిన తల్లిదండ్రులు పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం చికిత్స కోసం తాండూరు ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వికారాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం - rape
ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెద్దేముల్లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం