వికారాబాద్ జిల్లా తాండూర్లో రంజాన్ పండుగ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. వేల సంఖ్యలో ముస్లింలతో కిటకిటలాడే ఈద్గాలు లాక్డౌన్ నిబంధనల కారణంగా వెలవెలబోయాయి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ముస్లింలు ఎవరి ఇళ్లలో వారు రంజాన్ ప్రార్థనలు చేశారు.
తాండూరులో నిరాడంబరంగా రంజాన్ వేడుకలు - lock down effect on ramzan
ఆత్మీయ ఆలింగనాల స్థానంలో నమస్కారాలు... కోలాహల వాతావరణం కన్పించే ఈద్గాల్లో నిశ్శబ్దం... వికారాబాద్ జిల్లా తాండూరులో సందడిగా చేసుకునే రంజాన్ వేడుకలు నిరాడంబరంగా సాగాయి.
తాండూరులో నిరాడంబరంగా రంజాన్ వేడుకలు
ఈద్గా వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలింగనాలతో శుభాకాంక్షలు తెలుపుకునే ముస్లింలు పరస్పర నమస్కారాలు చేసుకున్నారు. ఇళ్లలోనూ భౌతిక దూరం పాటిస్తూ సంబురాలు జరుపుకున్నారు.