వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పాంబండ రామలింగేశ్వర ఆలయం ఏకశిలా పర్వతంపై నెలకొంది. ఈ పర్వతం నాగుపాము పడగ వలే పోడులుగా ఉంటుంది. ప్రతి ఏడాది రెండు సార్లు ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. 12 రోజులుగా కార్యక్రమాలు కొనసాగి ఉగాది పండుగ రోజు పూర్తవుతాయి.
ఉత్సవాలకు సిద్ధమైన రామలింగేశ్వరాలయం - vikarabad district latest news
వికారాబాద్ జిల్లాలోని పాంబండ రామలింగేశ్వర ఆలయం ఉగాది ఉత్సవాలకు సిద్ధమైంది. ఏకశిలా పర్వతంపై నెలకొన్న ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు సార్లు ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తరలి వస్తారని స్థానికులు పేర్కొన్నారు.
ఉత్సవాలకు సిద్ధమైన రామలింగేశ్వరాలయం
ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తారు. అక్కడి కొలనులో స్నానాలు చేస్తే సర్వదరిద్రాలు, శని తొలిగిపోతుందని భక్తుల నమ్మకం. భక్తులు తమ తలనీలాలు స్వామివారికి అర్పిస్తారు. ఈ ఉత్సవాల్లో రథ ప్రదక్షిణలు, పల్లకి సేవా కోలాటాలు, భజన, సంకీర్తనలు, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.
ఇదీ చూడండి :ఆ గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్కు తీర్మానం