తెలంగాణ

telangana

ETV Bharat / state

'మోదీ, షాలను తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది' - పౌరసత్వ బిల్లు వ్యతిరేకిస్తూ వికారాబాద్​లో నిరసనలు

కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ.. వికారాబాద్​ జిల్లా తాండూర్​లో నిరసనలు వెల్లువెత్తాయి. భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు ముస్లిం సంఘాలతో ఆందోళనకు దిగారు.

protest at tandoor in vikarabad district against citizenship bill
పౌరసత్వ బిల్లు వ్యతిరేకిస్తూ తాండూరులో నిరసనలు

By

Published : Dec 13, 2019, 7:05 PM IST

పౌరసత్వ బిల్లు వ్యతిరేకిస్తూ తాండూరులో నిరసనలు

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ వికారాబాద్​ జిల్లా తాండూర్​లో భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు ముస్లిం సంఘాలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాని మోదీ, మంత్రి అమిత్​ షాను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. జిల్లా ఎస్పీ నారాయణ భారీ బందోబస్తు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details