వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. తాండూర్ పురపాలక సంఘం పరిధిలోని మురుగు నీటి నిలువ ప్రాంతాలను ఆమె పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరంగా కొనసాగుతుందని.. పట్టణాలు, గ్రామాలలో ప్రతి ఆదివారం పది నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమం తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు పఠిష్ట చర్యలు: కలెక్టర్ పౌసుమి బసు - వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
తాండూర్ పురపాలక సంఘం పరిధిలోని మురుగు నీటి నిలువ ప్రాంతాలను కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల నియంత్రణకు.. మురికి నీరు, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు పఠిష్ట చర్యలు: కలెక్టర్ పౌసుమి బసు
పట్టణాలు గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలు వికారాబాద్, తాండూరు, పరిగి కొడంగల్ పట్టణాలలో సీజనల్ వ్యాధులు ప్రజలకు సోకకుండా.. ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి వివరాలను వైద్య శాఖ ద్వారా సేకరించి.. నివేదిక ఆధారంగా అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఇంటర్ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన