వికారాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 21 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జిల్లాను నిర్బంధించారు. పాజిటివ్ కేసులు నమోదైన కాలనీలను పోలీసులు పూర్తిగా మూసివేశారు.
డ్రోన్ కెమెరాల పటిష్ఠ నిఘాలో వికారాబాద్ - పటిష్ఠ నిఘా
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల 23 నుంచి లాక్డౌన్ను అమలు చేశాయి. వికారాబాద్ జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదవడం వల్ల జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం అయ్యింది. డ్రోన్ కెమెరాల ద్వారా పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేసింది.
ప్రజలెవరూ బయటకు రాకుండా నిలువరించారు. అయినప్పటికీ కొందరు ఇళ్ల నుంచి బయటికి వస్తుండటం వల్ల పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి:కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం