అది వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం. తెల్లవారుజాము 4 గంటలు అవుతుంది. అక్కడ వందల మంది క్యూలో ఉన్నారు. ఓ వైపు చలి.. మరో వైపు ఆధార్ కేంద్రం ఎప్పుడు తీస్తారా అని
ఆత్రుత. ఇందుకు కారణం రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులే.. అదేలా అంటారా.. రేషన్ పంపిణీకి ప్రభుత్వం ఐరిస్, మొబైల్ ఓటీపీ విధానాన్ని ఈనెల నుంచి అమలు చేయబోతోంది.
ఓటీపీతో రేషన్.. సామాన్యులకు తప్పని పరేషాన్... - వికారాబాద్ జిల్లా వార్తలు
రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఐరిస్, మొబైల్ ఓటీపీ విధానం అమలు కానుండటంతో ప్రజలు మీసేవా, బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
People who are రేషన్ పంపిణీ విధానంలో మార్పుతో ప్రజలకు ఇబ్బందులుstruggling to get mobile number link with Aadhaar
ఐరిస్‌తో రాకపోతే మొబైల్ ఓటీపీతో రేషన్ పంపిణీ చేస్తారు. కాని గ్రామాల్లోని సుమారు 30 శాతం మందికి ఆధార్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోలేదు. ఇప్పడు వారంతా మీసేవా, బ్యాంకులు, ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. చంటి పిల్లలను చంకలో వేసుకుని వణికే చలిలో నిరీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:ఏరోఇండియా షో వేదికగా నేడు 'తేజస్' కొనుగోలు ఒప్పందం
Last Updated : Feb 3, 2021, 10:52 AM IST