కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని అతిథి గృహంలో పలువురు పోలీసులు, విలేకరులకు మాస్కులు పంపిణీ చేశారు.
ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలి: ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి - latest news on People should practice self-restraint: MLA Narender Reddy
ప్రజలంతా స్వీయ నిర్బంధాన్ని పాటించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని అతిథి గృహంలో పలువురు పోలీసులు, విలేకరులకు మాస్కులు పంపిణీ చేశారు.
ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలి: ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
ప్రజలంతా పలు జాగ్రత్తలు పాటించి.. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని.. ఈనెల 14 వరకు ప్రజలంతా స్వీయ నిర్బంధాన్ని పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కొడంగల్ ఎంపీపీ ముదప్ప, కౌన్సిలర్ మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.